28-09-2025 12:38:05 AM
12,564గుంతల పూడ్చివేత
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్డు భద్రత చర్యలలో భాగంగా గుంతల పూడ్చివేత పనులు, క్యాచ్ పిట్ రిపేర్లు, కవర్ రీప్లేస్మెంట్లు, సెంట్రల్ మీడియన్ మరమ్మతులు నిరంతరంగా కొనసాగుతున్నాయి. శనివారం నాటికి నగరంలో మొత్తం14,871 గుంతలు గుర్తించగా.. వాటిలో 12,564 గుంతలకు మరమ్మతులు చేశారు. 12,547 గుంతలను పూడ్చివేయగా, శనివారం ఒక్కరోజే 17 గుంతలకు మరమ్మతులు చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు మరమ్మతు పనులు వేగంగా పూర్తిచేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ ఆదేశించారు.