22-09-2025 12:23:44 AM
మంత్రి ఉత్తమ్
హుజూర్ నగర్, సెప్టెంబర్ 21: గెల్లి అప్పారావు దంపతుల మృతి అత్యంత బాధాకరమని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్ పట్టణంలో ఇటీవల అనారోగ్య కారణాల చేత రోజుల వ్యవధిలో మృతి చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గెల్లి అప్పారావు అరుణ దంపతుల చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు.
డిసిసి ప్రధాన కార్యదర్శి,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. గెల్లి అప్పారావుతో ఉన్న సన్నిహితం గుర్తు చేసుకున్నారు. వ్యాపార రంగంలో, సేవా రంగంలో గిల్లి అప్పారావు కుటుంబం చేసిన సేవలను కొనియాడారు.గెల్లి అప్పారావు కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లిరవి అర్చన కుటుంబానికి ప్రజా జీవితంలో మంచి భవిష్యత్తు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.