calender_icon.png 26 September, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బతుకమ్మ సంబురాలు

26-09-2025 12:20:51 AM

ముకరంపురా, సెప్టెంబర్25(విజయక్రాంతి): బతుకమ్మ సంబరాలు కార్యక్రమంలో భాగంగా రైస్ మిల్లర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తొడుపునూరి కరుణాకర్ కుమార్తె శిలాసో వైష్ణవి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది బంధుమిత్రులు స్నేహితులు కుటుంబ సభ్యులందరూ కలిసి వైభవంగా జరుపుకున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా నూతనంగా పెళ్లి అయిన ఆడపిల్లలు అందరికీ వారి అత్తవారి నుండి బతుకమ్మ వాయనం తేవడం తెలంగాణ సంస్కృతి ఇందులో భాగంగా కరుణాకర్ కుమార్తె షీలా సౌ వైష్ణవి బతుకమ్మ సంబరాల కు అడపడుచు లను ఆహ్వానించి ఘనంగానిర్వహించారు.