26-09-2025 12:19:01 AM
* రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 25 (విజయక్రాంతి)ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.గురువారం వేములవాడ పట్టణంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రాజశ్యామల దేవి కుంకుమ పూజ, పల్లకి సేవ లో రాష్ట్ర ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఉంటుందని, దేవా,దేవి అమ్మవార్ల దీవెన్లతో అందరు సంతోషంగా ఉండాలని అన్నారు.దేవి నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. రాజన్న ఆలయంలో అమ్మవారు ప్రతి రోజు వివిధ రూపాల్లో దర్శనం ఇస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు..ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు...
అమ్మ వారి సేవలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది
ముకరంపురా, సెప్టెంబర్25(విజయక్రాంతి):కరీంనగర్ చైతన్యపురి లోని మహాశక్తి దేవాలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమా ర్ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలుచేయడంజరిగింది