calender_icon.png 23 September, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

23-09-2025 12:22:33 AM

  - బతుకమ్మ ఆడిన అదనపు కలెక్టర్ 

మేడ్చల్, సెప్టెంబర్ 22(విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రా రంభించారు. తొమ్మిది రోజులు సంబరాలు నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల ఆ ధ్వర్యంలో ప్రారంభమయ్యాయి.

అదనపు కలెక్టర్లు రాధిక గుప్త, విజయేందర్ రెడ్డి, డిఆర్‌ఓ హరిప్రియ, లా ఆఫీసర్ చంద్రావతి బ తుకమ్మలకు పూజలు నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, మ హిళలు పాటలు పాడుతూ పండుగ జరుపుకున్నారు. అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, డిఆర్‌ఓ హరిప్రియ, వివిధ విభాగాల అధిపతు లు, ఉద్యోగిన్నులు బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డి ఆర్ డి ఓ సాంబశివరావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి వినోద్ కుమార్, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్ లు తదితరులు పాల్గొన్నారు.