calender_icon.png 23 September, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర పటానికి క్షీరాభిషేకం

23-09-2025 12:22:08 AM

జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి): జీఎస్టీ తగ్గింపు పై హర్షం వ్యక్తం చేస్తూ భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.దసరా కానుకగా నరేంద్ర మోడీ భారతీయులకు ఇచ్చిన వరం జీఎస్టీ తగ్గింపు అని దీనిని పురస్కరించుకొని భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు నాయకత్వంలో జీఎస్టీ గురించి ప్రజలకు వివరిస్తూ మోడీ చిత్రపటంతో పాత కూరగాయల మార్కెట్ నుంచి టవర్ వరకు ర్యాలీగా వెళ్లి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

జీఎస్టీ తగ్గింపు వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు నిత్యవసర, కిరాణా వస్తువుల ధరలు తగ్గి లాభం జరుగుతుందని దీనివల్ల ఆ వర్గాలు పొదుపు చేసుకునే అవకాశం కూడా ఉంటుందని, పన్నులు తగ్గడమే కాకుండా ఆరోగ్య,జీవిత బీమా లాంటి వాటికి పూర్తిగా పన్నులు మినహాయించారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపల్లి కాశీనాథం, జిల్లా ఉపాధ్యక్షులు వేముల పోచమల్లు, మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి, సామాజిక వేత్త చిట్ల గంగాధర్, నరేందుల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ బండారి మల్లికార్జున్, గాదాసు భూమయ్య,వీరన్న, తునికి అంజన్న గొల్లపల్లి సత్యనారాయణ గౌడ్, బొందుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.