calender_icon.png 26 September, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీర్జాదిగూడలో బతుకమ్మ సంబురాలు

26-09-2025 12:00:00 AM

మేడిపల్లి, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘ నంగా జరిగాయి. నగరపాలక సంస్థ పరిధిలోని ఆర్పీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, కార్యాలయ మహిళా సిబ్బంది తో కలిసి బతుకమ్మలను తయారుచేసి ఆటపాటలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఐదవ రోజు అట్ల బతుకమ్మ సంబరాలను కన్నుల పండుగగా నిర్వహించినట్లు, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుక మ్మ ప్రతీక అని నగరపాలక సంస్థ కమిషనర్ త్రిలేశ్వర రావు తెలిపారు. రేపు కూడా బతుకమ్మ సంబరాలు జరుగుతాయని, ఈ సంబరాలలో నగరపాలక సంస్థ పరిధిలోని మహిళలందరూ భాగస్వాములు కావాలని కోరారు.

బోడుప్పల్‌లో 27న సద్దుల బతుకమ్మ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకముగా నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలలో భాగముగా బోడుప్పల్ నగర పాలక సంస్థ యందు 27వ తేదీ శనివారం శ్రీ బంగారు మైసమ్మ తల్లి గుడి ఆవరణలో ‘సద్దుల బతుకమ్మ‘ సంబరాలు నిర్వహించడం హించడం జరుగుతున్నది. కావున పట్టణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమీషనర్ ఎ.శైలజ తెలిపారు.