25-09-2025 11:42:22 PM
ఎల్బీనగర్: చైతన్యపురి డివిజన్ ను స్వచ్ఛతగా తీర్చిదిద్దాలని జీహెచ్ఎంసీ కార్మికులు, అధికారులను కార్పొరేటర్ రంగా నర్సింహగుప్తా కోరారు. చైతన్యపురి డివిజన్ లో వివిధ కాలనీల్లో చెత్తను తొలిగించడానికి కార్మికులకు గురువారం ఐదు ఆటో రిక్షాలు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నర్సింహ గుప్తా మాట్లాడుతూ... పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, స్వచ్ఛతతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ శానిటేషన్ అధికారులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.