26-09-2025 12:00:00 AM
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షులు దుబ్బా గోవర్ధన్
పినపాక, సెప్టెంబర్ 25,(విజయక్రాంతి):అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం ఆదివాసీల జీవితాల పట్ల శాపంగా మారిందని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘ మండల అధ్యక్షుడు దుబ్బా గోవర్ధన్ అన్నారు. గురువారం పినపాక మం డలం సీతారాంపురం గ్రామంలో జరిగిన ఆదివాసీ గిరిజన సంఘం సమావేశం లో ఆయన మాట్లాడారు. ఇప్పటికీ ఆదివాసీ గ్రామాల్లో సరైన రహదారులు లేక ఆదివాసీలు రోగాలు వచ్చినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఇవన్నీ ప్ర స్తుత ప్రభుత్వాలకు కనిపించడం లేదా అంటూ మండిపడ్డారు. నేటికీ విద్య, ఉద్యోగ, ఉపాధి, వైద్యావకాశాలుగానీ, కనీస మౌలిక సదుపాయాలుగానీ ఆదివాసి గ్రామాల్లోకి అందుబాటులోకి రాలేదన్నారు. రోజురోజుకు ఆదివాసీలు తమదైన ప్రత్యేక ఆచార వ్యవహారాలను, హక్కులను కోల్పోతున్నారని తాము పోరాడి సాధించుకున్న హక్కులు క్రమంగాబి ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయన్నారు.
ఐదవ షెడ్యూల్ లో ఈ ఆదివాసీ గ్రామాలు లేకపోవడం వల్ల గిరిజన చట్టాలు చట్టా లు అమలు కావడం లేదన్నారు.ఆదివాసీ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, తమ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ కోసం సాయుధ రైతాంగ పోరాటం ఫలితంగా ఆదివా సీలు అనేక హక్కులు సాధించుకున్నారన్నారు. ఆ ఉద్యమాల ఫలితంగా 1 ఆఫ్ 70 చట్టం, పెసా చట్టం, 2006 అటవీ హ క్కుల చట్టాలు ఆదివాసీలు సాధించుకోగలిగారన్నారు.
కానీ, ఆ చరణలో అవి అమలు కావడంలేదన్నారు. ప్రతి ఒక్కరూ జల్ జంగిల్ జమీన్ అన్న కొమరం భీమ్ నినాదంతో ఉద్యమించి హక్కులు సాధించుకోవాలన్నారు.అడవులు, అటవీ వనరులు, ఖనిజాలనూ కార్పొరేట్లకు ధారాదత్తం చేసే ప్రయత్నం మోదీ ప్రభుత్వం చేస్తోందన్నారు. ఆదివాసి గిరిజనులను అడవుల నుంచి గెంటివేయాలన్న బిజెపి ఎత్తుగడలు ఆదివాసీల నెత్తిన కత్తిలా వేలాడుతూనే ఉందన్నారు.
పెసా, అటవీ హక్కుల గు ర్తింపు చట్టాలు ఆటంకంగా ఉన్నందున వీటిని నిర్దాక్షిణ్యంగా రద్దుచేయడానికి అటవీ సంరక్షణ నియమాల పేరుతో 202 3లో తీసుకొచ్చిన చట్టంతో ఆదివాసీలు ఇప్పటివరకు పోరాడి సాధించుకున్న అన్ని హక్కులూ అణచివేతకు గురౌతాయన్నారు.
ఓవైపు పోడు భూముల్లో అటవీ అధికారులు దౌర్జన్య కాండ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి గ్రామంలో కమిటీలు వేసి గిరిజన సంఘాలను బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి మడివి రమేష్, కరకగూడెం సిపిఎం మండల కార్యదర్శి కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.