30-09-2025 12:22:58 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ఓజోన్ హాస్పిటల్స్ కొత్తపేటలో వరల్డ్ హార్ట్ డే ఘనంగా నిర్వహిం చారు. ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే డి. సుధీర్‌రెడ్డి 3కే వాకథాన్ ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్ సిబ్బందితో కలిసి వాకథాన్‌లో పాల్గొన్నారు. చైర్మన్ సత్యసాయి ప్రసాద్ హార్ట్ అటాక్ కిట్‌ను ఆవిష్కరించి, ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డిఫిబ్రిలేటర్ సదుపాయం ప్రారంభించారు.
కేవలం రూ.799 కే హార్ట్ హెల్త్ ప్యాకేజ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మ్యానేజింగ్ డైరెక్టర్ దీప్తి సీపీఆర్.. సమయానికి సీపీఆర్ చేయడం గురించి వివరించారు. డాక్టర్ ఇంద్రసేన్‌రెడ్డి కంకణాల (డైరెక్టర్, జనరల్ ఫీజిషన్), డాక్టర్ వై.పి. రాజు((కార్డియాలజిస్ట్), డాక్టర్ సురేష్ గూడె (కార్డియాలజిస్ట్) మరియు డాక్టర్ సంతోష్ సీటి సర్జన్ గుండె వ్యాధుల నివారణ, అవగాహన, మరియు హార్ట్ అటాక్ కిట్ ప్రాముఖ్యతపై గురించి వివరించారు. వేడుకలో మధుసూదన్‌రెడ్డి వై, ఆపరేషనల్ డైరెక్టర్, డాక్టర్ వై సుమన్ కుమార్, సీఓఓతో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.