23-09-2025 12:00:00 AM
నిర్మల్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) : జిల్లాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు సోమవారం కలెక్టర్ కార్యాల యంలో బతుకమ్మ సంబరాల నిర్వహణపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడు తూ, నవరాత్రుల్లో ప్రతి రోజు బతుకమ్మ వేడుకలు వైభవంగా జరగాలన్నారు.
అన్ని శాఖల అధికారులు తమ తమ కార్యాలయా ల్లో సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పండు గ జరపాలని, సద్దుల బతుకమ్మ రోజున ఊరేగింపులో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. విద్యార్థులలో రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన పెంచేందుకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజే యాలని ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసు కోవాలన్నారు.
నిమజ్జనం ప్రాంతాల్లో లైటిం గ్, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పట్టణంలో సద్దుల బతుకమ్మను నిర్వహించేందుకు ఎన్టీఆర్ మినీ స్టేడియం లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించా రు. అనంత రం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘పోషణ మాసం’కు సంబ ంధించిన గోడ ప్రతిని అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, డీఆర్డీవో విజయలక్ష్మి, డివైఎస్‌ఓ శ్రీకాంత్ రెడ్డి, డిపిఓ శ్రీనివాస్, డీఈఓ భోజన్న, డి పి ఆర్ ఓ విష్ణువర్ధన్, ఉద్యాన వన శాఖ అధికారి రమణ, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, డి ఈ హరిభువన్, సిడిపిఓ సరిత పాల్గొన్నారు.