calender_icon.png 26 September, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాంటీ ర్యాగింగ్‌పై విద్యార్థులకు అవగాహన

26-09-2025 12:00:00 AM

ఘట్ కేసర్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఘనాపూర్  కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ లో గురువారం ఆంటీ ర్యాగింగ్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈకార్యక్రమానికి ఘట్కేసర్ ఇన్ స్పెక్టర్ ఎం. బాలస్వామి, సబ్ ఇన్ స్పెక్టర్ ఎ. శేఖర్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు ఆంటీ ర్యాగింగ్ పై అవగాహన కల్పించారు.

ర్యాగింగ్లో పాల్గొనడం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలు, శిక్షలు, ర్యాగింగ్ను నివారించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై వారు విద్యార్థులకు వివరించారు.  ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లు డాక్టర్ కె. శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ఎస్. శ్రీనాథ్ కాశ్యప్, చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జి. నాగరాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈసందర్భంగా  నిర్వహణ, అధ్యాపకులు, విద్యార్థులు రాచకొండ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.