18-09-2025 12:32:19 AM
వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
రంగారెడ్డి,సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం కొంగరకలాన్‌లో బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వేడుకలకు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర నీటి పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అంతకు ముందు మంత్రి కి కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి శ్రీనివాస్, డిసిపి సునీత రెడ్డి లు పూలే బొక్కేలు అందజేసి స్వాగతం పలికారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి పుర ప్రముఖులను, అధికార, అనధికారులను కలిసి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వేడుకలను పురస్కరించుకొని జిల్లా ప్రగతిని, సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
కార్యక్రమంలో టీయూఫ్‌ఐడిసీ ఛైర్మన్ చల్లా నరసింహారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిలక మధుసూధన్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రా రెడ్డి, శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, కలెక్టరేట్ ఏ.ఓ. సునీల్, ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బం ది, ప్రజలు పాల్గొన్నారు.
జాతీయ పతాకం ఆవిష్కరించిన కలెక్టర్
మేడ్చల్, సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి): ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ మను చౌదరి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, విజయేందర్ రెడ్డి, డీసీపీ కోటిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, డి ఆర్ డి ఓ సాంబశివరావు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వినోద్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారి, ఏవో రామ్మోహన్, డిఆర్‌డిఓపిడి కాంతమ్మ పాల్గొన్నారు.
గచ్చిబౌలిలో..
గచ్చిబౌలి, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆవిష్కరించారు. దేశభక్తి భావాలను ప్రతిబింబిం చేలా జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ వేడుకలో సైబరాబాద్ ట్రాఫిక్ జాయిం ట్ కమిషనర్ డాక్టర్ గజరావు భూపాల్ ఐపీఎస్తో పాటు డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
హైడ్రా కార్యాలయంలో ..
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దిశానిర్దేశం చేశారు. ప్రజల సాధకబాధలను అర్థం చేసుకుని సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలని సూచించారు. హైడ్రా కార్యాలయంలో బుధవారం నాడు ప్రజాపాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు.
ఈ సందర్భం గా తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి జాతీయ జెం డాను ఆవిష్కరించ రు. అనంతరం ఆయన మాలాడుతూ 1948, సెప్టెంబరు 17న భార త ప్రభుత్వంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన సందర్భాన్ని, నాటి పోరాటాన్ని గుర్తుచేశారు. ప్రజాపాలనకు హారతి పట్టిన రోజుగా సెప్టెంబరు 17ను అభివర్ణించారు.
అందుకే సెప్టెం బరు 17ను ప్రజా పాలన దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. హైడ్రాలో పని చేస్తున్న ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని వారి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని సూచించారు. ప్రజాపాలన దినోత్సవం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో హైడ్రా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
మేడ్చల్, సెప్టెంబర్ 17(విజయ క్రాంతి): కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మార్కెట్ కమిటీ ఆవరణలో చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్ జాతీయ పతా కాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పథకాల వల్ల అన్ని వర్గాల వారు లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.
జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌడే మహేష్, రవి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. వివేకానంద చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ వజ్రేష్ యాదవ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరెడ్డి, రమేష్, చాపరాజు, రేగురాజు తదితరులు పాల్గొన్నారు.
గడ్డి అన్నారం మార్కెట్‌లో..
అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 17: బాటసింగారం గడ్డిఅన్నారం మార్కెట్ కార్యాల యంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమలో వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కర చారి, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎల్. శ్రీనివాస్, డైరెక్టర్లు మచ్చేందర్ రెడ్డి, అంజయ్య, బండి మధుసూదన్ రావు, గణేష్ నాయక్, రఘుపతి రెడ్డి, వెంకటేశ్వర్లు గుప్తా, ఇబ్రహీం, మార్కెట్ అధికా రులు, సిబ్బంది పాల్గొన్నారు.