calender_icon.png 18 September, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగులకు, సర్కార్‌కి వారథిగా ఉంటా

18-09-2025 12:32:32 AM

  1. బీఆర్‌ఎస్ పాలనలో ఒక గ్రూప్--1 వేయలేకపోయారు 
  2. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
  3. హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమరుల స్థూపానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

మునుగోడు,సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): నిరుద్యోగులకు, ప్రభుత్వానికి వారధిగా ఉండి మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని, నిరసనలు, ధర్నాలు మాను కోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.బుధవారం నిరుద్యోగుల ఆహ్వానం మేరకు హైదరాబాదులోని గన్ పార్క్ లో నిరుద్యోగులతో కలిసి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి ఆయన మాట్లాడారు.

నిధులు, నియామకాల కోసం, రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఏ ఒక్కరికి న్యాయం జరగలేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు పోషించిన పాత్ర వెలకట్టలేనిది అని అన్నారు.బీఆర్‌ఎస్ పాలన అవినీతిమయంగా మారి దోచుకొని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు. బీఆర్‌ఎస్  పదేండ్ల పాలనలో నిరు ద్యోగులకు నోటిఫికేషన్లు వెయ్యక వారి కలలు కలలాగే మిగిలిపోయాయని అన్నారు. 

తెలంగాణ యువత కేసీఆర్‌ని ఫామ్ హౌస్‌కు పంపించడానికి పోషించిన పాత్ర అమోఘమైనది అని అన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం, ఛిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం సెప్టెంబర్ 17ను కూడా ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీ సమస్య ల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా,సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.