18-09-2025 12:33:17 AM
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరణ
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల టౌన్ సెప్టెంబర్ 17 : గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీజీ, భారతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండా ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి సెప్టెంబర్ 17వ తేది ప్రజాపాలన దినోత్సవాన్ని అధికారికంగా ఈ కార్యక్రమాలు జరిపించటం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ్ సంఘం అధ్యక్షులు పచ్చర్ల శ్రీధర్ గౌడ్, ప్రజాప్రతినిధులు, జిల్లా సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.