18-09-2025 12:30:21 AM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): తాడూరు మండలం చర్ల తిరుమలాపూర్ గ్రామానికి చెందిన 36 ఏళ్ల గర్భిణి యాదమ్మ అపస్మారక స్థితిలో నాగర్ కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు జరిపిన గైనకాలజిస్ట్ హెచ్ ఓ డి నీలిమ హేటరోటోపిక్ ప్రెగ్నెన్సీ (ఎట్రోటోపిక్ ప్రెగ్నెన్సీ) గా గుర్తించారు. లక్ష గర్భవతుల్లో ఒకరికి మాత్రమే సంభవించే ఈ అరుదైన పరిస్థితి ఉంటుందని గుర్తించి జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ ఉషారాణి సహకారంతో వెనువెంటనే శాస్త్ర చికిత్స చేసి ఆ మహిళకు పునర్జన్మ ప్రసాదించారు. దీనిపై జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, ఇతర వైద్యులు ప్రముఖ గైనకాలజీ, అనస్తీషియా వైద్యులు డాక్టర్ టి ఉషారాణి, డాక్టర్ నీలిమ, డాక్టర్ సుప్రియ, డాక్టర్ ధీరజ్ లను ఆస్పత్రి వైద్య బృందాన్ని అభినందించారు.