calender_icon.png 26 September, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

26-09-2025 12:00:00 AM

ఎల్బీనగర్, సెప్టెంబర్  25 : తెలంగాణ సంస్కృతి ప్రతీక బతుకమ్మ అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. నాగోల్ లోని ఉప్పల నివాసం వద్ద అంతర్జాతీయ ఆర్యవైశ్య ప్రథమ మహిళ ఉప్పల స్వప్న ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు.

మహిళలు కోలాటం, దాండియా ఆడుతూ పాడుతూ నృత్యం చేశారు. ఈ సందర్భగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి బతుకమ్మ తరతరాల ప్రతీకగా నిలిచిందన్నారు.

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ..

ఎల్బీనగర్, సెప్టెంబర్ 25 : జీహెచ్‌ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో గురువారం బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఉత్సవాలకు సరూర్ నగర్, హయత్ నగర్, ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని డిప్యూటీ కమిషనర్లు, కార్పొరేటర్లు, ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు, కార్పొరేటర్లు, మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు.

బతుకమ్మ ఆటపాట లతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఆర్కేపురం, హస్తినాపురం, నాగోల్ డివిజన్ల కార్పొరేటర్లు రాధా ధీరజ్ రెడ్డి, సుజాత నాయక్, చింతల అరుణా సురేందర్ యాదవ్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.  వీరితోపాటు సరూర్ నగర్, హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు బతుకమ్మ ఆడుతూ మహిళలను ఉత్సాహపరిచారు.