calender_icon.png 30 September, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

30-09-2025 02:01:17 AM

విశ్వవ్యాప్తంగా ప్రతిష్ట పెంచిన పండుగ  తలసాని శ్రీనివాస్ యాదవ్

సనత్‌నగర్ సెప్టెంబర్ 29 (విజయ క్రాంతి) :- తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ భగవంతుడిని పూలతో పూజిస్తామని, ఆ పూలను పూజించే పండుగ బతుకమ్మ అన్నారు.

తెలంగాణ లో పుట్టిన బతుకమ్మ నేడు విశ్వవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మను ఎంతో ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.

9 రోజుల పాటు మహిళలు, యువతులు ఎం తో భక్తితో బతుకమ్మ ఆడుతారని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, బిఆర్‌ఎస్ పార్టీ మహిళా నాయకులు బాసా లక్ష్మి, నాగలక్ష్మి, శ్రీలక్ష్మి, దుర్గ, శ్రీ రంజని, అరుణ, బిఆ ర్‌ఎస్ పార్టీ  డివిజన్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, నామన సంతోష్ కుమార్, కూతురు నర్సింహ, కట్టా బలరాం, వనం శ్రీనివాస్ పాల్గొన్నారు.