calender_icon.png 26 August, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రతా నిర్వహణలో సమస్యలు తలెత్తదు

25-08-2025 11:51:38 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి,(విజయక్రాంతి): గణేష్ పండుగ సందర్భంగా విగ్రహాల ప్రతిష్టాపన, నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి భద్రత నిర్వహణ సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశించారు. సోమవారం వారు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ కె. నర్సింహారెడ్డి, ఏఎస్పి బి. చైతన్య రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు, మునిసిపల్ కమిషనర్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి పట్టణంలో గణేష్ నిమజ్జన ప్రారంభ స్థానం నుండి   దేవునిపల్లి పిఎస్ పరిధిలో గల టేక్రియాన్ చెరువు ముగింపు స్థానం వరకు స్వయంగా పరిశీలించి, భద్రత సౌకర్యాల నిర్వహణలో ఇబ్బందులను గుర్తించి తక్షణమే సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. నిర్వహణ కార్యక్రమంలో సమస్యలు తలెత్తితే వెంటనే అధికారులకు తెలియజేయాలని వారు సూచించారు.