calender_icon.png 19 October, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బంద్ ప్రశాంతం

18-10-2025 07:44:02 PM

రాజాపూర్: బీసీలకు అని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ శనివారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ బంద్ ప్రశాంతంగా ముగిసింది. మండల కేంద్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తలపెట్టిన ధర్నాలు మండలంలోని వివిధ పార్టీల నాయకులు బీసీలకు మద్దతుగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. బీసీ బందు నేపథ్యంలో మండల కేంద్రము, మండలంలో వేద గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు వ్యాపార దుకాణాలు బీసీలకు మద్దతుగా స్వచ్ఛందంగా బందు పాటించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీల నాయకులు కుల సంఘాల నాయకులు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపాయి.