calender_icon.png 19 October, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లు అందజేసిన ఎండీ రజాక్..

18-10-2025 07:45:56 PM

కొత్తగూడెం (విజయక్రాంతి): మహబూబ్ నగర్ జిల్లాలో 18, 19, 20 తేదిలలో జరుగుచున్న ఎస్జిఎఫ్ రాష్ట్ర స్థాయి, క్రీడా పోటీలలో భాగంగా అండర్ 17 సంవత్సరాల బాలికల వాలీబాల్ పోటీలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తరుపున పాల్గొనుచున్న క్రీడాకారులకు జెడ్పిహెచ్ఎస్, రుద్రంపూర్ పాఠశాల నందు నిర్వహించిన క్యాంపు ముగింపు సభలో పాఠశాల పూర్వ విద్యార్థి, పాఠశాల ముఖ్య సలహాదారుడు అయినటువంటి ఎండీ. రజాక్ క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ ను అందచేశారు. క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ ను స్పాన్సర్ చేసిన వారు డి.పురుషోత్తం జడ్పీ సీఈఓ, మహబుబబాద్.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. బాలాజీ ,ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు , పాఠశాల పూర్వ విద్యార్థి బృందం పాల్గొని క్రీడాకారులకు అభినందనలు తెలియచేసారు.