calender_icon.png 19 October, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి

18-10-2025 07:57:37 PM

బీసీ సంఘాల డిమాండ్

మంగపేట,(విజయక్రాంతి): తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) శనివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 42% రిజర్వేషన్ ను వెంటనే అమలు చేయాలని బీసీ సంఘాల జేఏసీ సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో రాజుపేట నుండి కమలాపురం వరకు సుమారు 200 మోటార్ సైకిళ్లతో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతును తెలిపారు. అనంతరం కమలాపురం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.