calender_icon.png 13 July, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం రిజర్వేషన్లతో బీసీ సంఘం సంబరాలు

12-07-2025 06:21:52 PM

మందమర్రి (విజయక్రాంతి): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం పట్ల జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆదివారం కేకే కట్ చేసి పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు సకినాల శంకర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయడం హర్షణీయమన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం బీసీల విజయం అని ఆయన స్పష్టం చేశారు.

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాల ఫలితమే 42 శాతం రిజర్వేషన్లు సాధించడం జరిగిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహిం చడం బీసీలకు గర్వకారణ మన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీసీ ప్రధాన కార్యదర్శి బత్తుల సతీష్, కోశాధికారి గుడ్ల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బేర వేణుగోపాల రావు, ఏదులాపురం రాజు, శేఖర్, వాయిస్ ప్రెసిడెంట్ దేవులపల్లి ప్రభాకర్, కార్యదర్శి నర్సోజి, పోలు సంపత్ లు పాల్గొన్నారు.