calender_icon.png 13 July, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీధి కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు

12-07-2025 06:26:26 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలోని గౌతమిపురం కాలనీలో వీధి కుక్కలు దాడి చేయడంతో రెండేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. శనివారం మధ్యాహ్నం ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి ఎషికాపై కుక్కలు దాడి చేశాయి. స్థానికులు వెంటనే కుక్కలను తరిమి కొట్టారు. గాయపడిన చిన్నారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించారు. కాగా అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.