calender_icon.png 13 July, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి

12-07-2025 06:19:20 PM

ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడీల కుమార్ గౌడ్, సర్పంచుల సంఘం అధ్యక్షులు ప్రణీల్ చందర్..

మహబూబ్ నగర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడిల కుమార్ గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మహబూబ్ నగర్ బీసీ కమ్యూనిటీ హాల్ లో బిసిపిఎఫ్, బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలలో 42శాతం బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తామని నమ్మపలికి బీసీల ఓట్ల ద్వారా గద్దెనెక్కి కాలయాపన చేస్తూ ఆర్డినెన్సు ద్వారా అమలు చేస్తామని చెప్పడం బీసీలను మోసం చేయడమేన్నారు.

బీసీ సామాజిక వర్గానికి మొత్తం జనాభా సర్వే నిర్వహించాలని, 33 శాతం రిజర్వేషన్లలో బీసీ మహిళలకు అవకాశం ఇవ్వాలన్నారు. ఇచ్చిన మాట తప్పి.. ఎన్నికలను జీ.ఓ ల ద్వారా నిర్వహించాలని చూస్తే బిసి వర్గాల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ లలో కూడా 42శాతం బీసీలకు ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీలకు అతీతంగా రాష్టంలోని బిసి సామాజిక ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలను భాగస్వామ్యం చేసి ఈనెల 15 న ఇందిరా పార్క్ దగ్గర 10 వేల బీసీ బిడ్డలతో బిసిల మహా ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహా ధర్నా కు బిసి ల నుండి అన్ని సంఘాలు, ప్రజలు, వార్డ్ మెంబర్ నుండి ఎమ్మెల్యే, ఎంపీ ల వరకు రాజకియపార్టీల కతీతంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తో పాటు, రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుండి పెద్దయెత్తున పాల్గొని మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.

అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే మరో సకల జనుల సమ్మె తరహాలో మరో ఉద్యమం చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం  బీసీల మహా ధర్నా కు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గడీల కుమార్ గౌడ్, ప్రణీల్ చందర్, సుర్వి యాదయ్య గౌడ్, దేవి రవీందర్, మూడ మాజీ చైర్మన్  వెంకన్న,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేష్,సుప్ప ప్రకాష్, వల్లూరి వీరేష్ తమ్మన్నగారి సంగన్న సిద్దగోని శ్రీనివాస్,,మాజీ కౌన్సిలర్ నవ కాంత్ ,బీసీ సమాజ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్,మాజీ సర్పంచులు యాదయ్య యాదవ్, గోపాల్, శ్రీనివాస్ యాదవ్, మల్లేష్, కుల సంఘాల నాయకులు సత్యం సాగర్, పురుషోత్తం, గిరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నవీన్, సాగర్, రాజేష్, మేకల కనకయ్య తదితరులు పాల్గొన్నారు.