12-11-2025 12:00:00 AM
బూర నర్సయ్య గౌడ్ :
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచా ర సమయంలో 2023, నవంబర్ 10న రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్య మంత్రి సిద్ధరామయ్య, ఇతర సీనియర్ నాయకులు కలిసి కామారెడ్డిలో ఎంతో అట్టహాసంగా బీసీ డిక్లరేషన్‌తో పాటు కాం గ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆకాశమే హద్దుగా, బీసీలను బిలియనీర్లుగా తీర్చిదిద్దుతామని రేవంత్‌రెడ్డి, చేతికి ఎముకలు లేని దాన కర్ణుడిగా హామీ ల వర్షం కురిపించారు.
అప్పటికే బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో భరోసా లేకుండా పో యిన బీసీలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసి రేవంత్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నా రు. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ తన రెం డేళ్ల పాలన పూర్తి చేసుకోనున్న నేపథ్యం లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు మా త్రం ఎండమావిలా మారిపోయింది. కాం గ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో బీసీ సంక్షేమ, అభివృద్ధి హామీలు అక్షరాల అర్ధ శతకం.. అంటే 50 హామీలన్నట్లు.
అందు లో 16 పేజీల కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ని 21 అంశాలు, 25వ పేజీలో ఉన్న ‘అసైన్డ్ భూములకు’ పూర్తి పట్టాలు ఇవ్వడం, 30వ పేజీలో ఉన్న వెనుకబడ్డ తరగతుల సంక్షేమం కింద 28 అంశాలు.. ఇలా మొ త్తంగా 50 హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. బీసీ డిక్లరేషన్ పట్టికను ఒకసారి పరిశీలిస్తే కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, కాంట్రాక్టుల్లో 42 శాతం, బీసీ సబ్‌ప్లాన్, ఏడాదికి 20వేల కోట్లు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ, 10 లక్షల వడ్డీలేని రుణా లు, బీసీ భవన్లు, ప్రతి మండలానికి గురుకులం, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, వృ త్తి బజార్, ఫెడరేషన్స్‌కు 10 లక్షల రుణా లు, మున్నూరు కాపు కార్పొరేషన్, పద్మశాలి పవర్ లూమ్స్‌కు 90 శాతం సబ్సీడీ ఇలా మొత్తం 50 వాగ్ధానాలు చేసింది. అ యితే ఇందులో మొదటిది తప్ప మిగతా వాటికి కోర్టు అడ్డంకులు లేకపోయినప్ప టికీ రాజకీయ డ్రామా తప్పితే చిత్తశుద్ధి శూన్యం.
ఆదిలోనే హంసపాదు!
ఆదిలోనే హంసపాదు అన్నట్లు, మొద టి హామీ జనగణనలో కులగణన ఆరు నెలలు కాదు, 24 నెలలు దాటినా ఇంకా అసంపూర్తిగానే ఉంది. కుల గణనలో భాగంగా బీసీ జనాభాను 54 శాతం నుం చి 46 శాతానికి కుదించా రు. కొత్తగా హిం దూ బీసీలు 46 శాతం, ముస్లిం బీసీలు 10 శాతం.. మొత్తంగా 56 శాతం అని కాంగ్రెస్ కొత్త నిర్వచనం చె ప్పింది. అయితే దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిన తెలంగాణ కుల గణన వివరాలను, డేటాను ఇప్పటివరకు బహిర్గతం చేయకపోవడం గమనార్హం.
దేశానికి రోల్ మోడల్ అని దేశం మొత్తం డప్పు కొట్టిన రాహుల్-రేవంత్‌లు కుల గణన వివరాలు బయటపెట్టకపోవడానికి ప్రధాన కారణం అదంతా తప్పుల తడకగా ఉండడమే. తెలంగాణలో చేపట్టిన కుల గ ణన సర్వేలో దాదాపు 14 నుంచి 16 లక్షల కుటుంబాల వివరాలను తీసుకోలేదని తేలడంతోనే వివరాలను బయటపె ట్టేం దుకు కాంగ్రెస్ జంకుతుందనిపిస్తుంది. బీసీల్లో హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అనే కొత్త నిర్వచనలో ఆంతర్యం ఏమిటన్న ది అర్థంకాని విషయం.
దేశంలో ఎక్కడా లేని విధంగా కుల గణనలో హిందూ బీ సీ లు, ముస్లిం బీసీలు అంటూ కాంగ్రెస్ కొత్త రాజకీయ నాటకం మొదలుపెట్టింది. హిం దూ, ముస్లిం బీసీలను రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కోటాలో ‘ముస్లిం ఎస్సీలు’, ముస్లిం ఎస్టీలు అని కోటా పెడితే ఆయా వర్గాలు అంగీకరిస్తాయా? అందుకు రాజ్యాంగం ఒప్పుకుంటుందా? అనే ప్రశ్నలు మెదులుతాయి. కేవలం బీసీ రిజర్వేషన్లను నిర్వీర్యం చేసేందుకే కాంగ్రెస్ ఈ కుట్ర పన్నిందనిపిస్తుంది.
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న ప్పుడు 2020 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొ త్తం 150 కార్పొరేటర్ల స్థానాలకు గానూ రిజర్వేషన్ల దామాషా ప్రకారం బీసీలకు 50 దక్కితే, అందులో 30 నుంచి 33 సీ ట్లు ముస్లిం అభ్యర్థులు గెలిచే విధంగా రిజర్వేషన్ అమలు చేసిందన్న నిజం అందరికీ తెలిసిందే. దీనివల్ల బీసీలకు నష్టం జరిగిన ట్లే కదా అన్నది నా అభిప్రాయం.
రాజకీయ డ్రామాలు..
తెలంగాణలో ముస్లింల జనాభా 12 శాతంగా ఉంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లలో ఏ-కేటగిరీ కింద ముస్లింలు 7 శాతం ఉండగా.. బి-కేటగిరీలో 10 శాతం, ఈ- గ్రూప్‌లో 4 శాతం, ఈడబ్ల్యూఎస్ కోటాలోని 10 శాతం రిజర్వేషన్లలోనూ ముస్లిం లు లబ్ధి పొందుతున్నారు. ముస్లింల జనా భా 12 శాతముంటే రిజర్వేషన్లలో మాత్రం వాళ్లు 31 శాతం ఫలాలను అందుకుంటున్నారన్నది వాస్తవం కాదా అని ఆలోచిం చాల్సిన అవసరముంది.
రిజర్వేషన్ల ప్రాతిపదిక అంటే.. భారతదేశంలో హిందూ మతంలో కుల వ్యవస్థ వల్ల కొన్ని కులాలు విద్య, ఉపాధి, రాజకీయ వివక్షకు గురయ్యారు. వాటిని సరిదిద్దడానికి చేసే ప్రక్రియను ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అంటారు కానీ మత పరమైన రిజర్వేషన్లు ఎన్నటికీ ప్రాతిపదికన తీసుకోరు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కానీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 24 నెలలు కావొస్తున్నా మీన మేషాలు లెక్కిస్తోంది.
మొద ట ఆర్డినెన్సు అన్నారు, తదుపరి చట్ట సవరణ అన్నారు, ఇప్పుడు జీవో నంబర్ 9 పేరిట కాలయాపన చేస్తున్నారు. బీసీలను కేవలం రాజకీయ అంశాలకు వాడుకోవడానికే తప్ప వారికి 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి రేవంత్ సర్కార్‌లో ఎక్కడా కనిపించడం లేదన్న విషయం స్పష్టమవుతుంది. ఒకవేళ ఆ చిత్తశుద్ధి ఉం డుంటే కుల గణన డేటాను ఎప్పుడో పబ్లిక్ డొమైన్‌లో పెట్టేవారు కదా?. బీసీ మేధావులంతా ఈ అంశాన్ని ఒకసారి ఆలోచిం చాల్సిన అవసరముంది.
చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలంటూ కేంద్రంపై ఒత్తి డి తెచ్చే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా లు చేస్తే ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహు ల్ గాంధీ కనీసం చుట్టం చూపుగా కూడా రాలేదు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 50 రోజులు జరిగితే రాహుల్ కనీసం ఒక్కరోజు కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని లే వనెత్తలేదం టే ఆయనకు బీసీలంటే ఎంత ప్రేమ ఉం దో స్పష్టంగా అర్థమవుతుంది.
పార్లమెంట్ లేదా అసెంబ్లీ చేసే చట్టాలను సమీక్ష చేసే అధికారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లేదా హైకోర్టుకు ఉంటుందని 9వ షెడ్యూల్‌పై నడుస్తున్న సమీక్ష చెప్పకనే చెబుతుంది. గతంలోనూ సుప్రీం లేదా హైకోర్టులు పార్లమెం ట్ లేదా అసెంబ్లీలు చేసిన చట్టాలు రద్దు చేసిన దాఖలాలున్నాయి.
ఉదాహరణకు ప్రధాని మోదీ ఉన్నత న్యాయస్థానాల్లో సామాజిక న్యాయానికి పునాది వేయాలని తెచ్చిన నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్ (ఎన్‌జేఏసీ)ని సుప్రీంకోర్టు కొట్టివేసిన మాట నిజం కాదా? అలాగే బీహా ర్‌లో ఎన్డీయే ప్రభుత్వం తెచ్చి న 63 శా తం రిజర్వేషన్లను ఆ రాష్ట్ర హై కోర్టు కొట్టివేస్తే, ప్రస్తుతం ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నది నిజమా అన్నది పరిశీలించాలి.
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా రాజకీయ డ్రామా కు పోకుండా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తే ప్రయోజనం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఆరు గ్యారెంటీల అమల్లో నూ వైఫ ల్యం స్పష్టంగా కనిపిస్తుంది. అం తిమంగా నమ్మి ఓట్లు వేసి అధికారం కట్టబెట్టిన బీసీలను, తెలంగాణ ప్రజలకు హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తారా లేదా నీతిమంతులుగా పనిచేస్తారా అన్నది చూడాలి. కాంగ్రెస్ ఒకవైపు మైనారిటీ ఓ ట్లను కూడగట్టుకొని, మరోవైపు హిం దువుల ఓట్లను కులాల పేరుతో చీల్చాల నే తపనే తప్పితే, బీసీలకు న్యాయం చే యా లన్నది ఏ కోశానా కనిపించడం లేదు. ఇది నగ్న సత్యం.
వ్యాసకర్త: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు