calender_icon.png 12 August, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

14న బీసీ గర్జన కదనభేరికి కలిసి రావాలి

12-08-2025 12:35:15 AM

  1. కాంగ్రెస్ మోసపూరిత హామీలపై బీసీలను మేలుకొల్పేందుకే కదనభేరీ

మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

కరీంనగర్, ఆగస్టు 11 (విజయ క్రాంతి): ఈ నెల 14న కరీంనగర్లో లో బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించే బీసీ గర్జన కదన భేరీకి బీసీ సంఘాలు, నాయకులు, మేధావులు, బీసీబిడ్డలు, పార్టీ శ్రేణులు కలిసి వచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలసి జ్యోతిబాపూలే మైదానంలో ఏర్పాట్లు పరిశీలించారు.

చింతకుంట లోని పార్టీ ఆఫీస్ లో ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని, లక్ష కోట్ల బడ్జెట్లో 20 వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని అలవికాని హామీలు ఇచ్చిందని అన్నారు.

అవి అమలు చేసిన సందర్భాలు లేవని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన పెద్ద తప్పుల తడక అని, మళ్లీ బీసీ రిజర్వేషన్ల పేరుతో మోసం చేయాలని చూస్తుంది. కాంగ్రెస్ మోసపూరిత హామీలు, బీసీ రిజర్వేషన్ పేరిట చేస్తున్న కుట్రలపై బీసీ ప్రజలను మేలుకొల్పేందుకే ఈ నెల 14న కరీంనగర్ లో బీసీ గర్జన కదనభేరిని నిర్వహిస్తున్నామని అన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కదనభేరికి ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.

బీసీ బిడ్డలు, సంఘాల నాయకులు, మేధావులు, బీఆర్‌ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని బీసీ గర్జన కదనభేరిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణారావు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ స్పీకర్ బండ ప్రకాష్ , మాజీ కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు తుల ఉమ, కనుమల్ల విజయ, వసంత ,

మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, వొడితెల సతీష్ బాబు, విద్యాసాగర్ రావు, కోరుకంటి చందర్, నాయకులు బండ శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, కరీంనగర్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ లు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, కొత్తపల్లి బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాసరపు శ్రీనివాస్ గౌడ్, పలువురు నాయకులు తదితరులుపాల్గొన్నారు.