calender_icon.png 7 November, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ విగ్రహానికి బీసీ నేతల వినతిపత్రం

07-11-2025 01:20:45 AM

రాజన్న సిరిసిల్ల,నవంబర్ 6 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసిన జీవో 9 తో జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్ ,ఎన్నికల నోటిఫికేషన్ చట్ట విరుద్ధమని,రాజ్యాంగ విరుద్ధమని బీసీ వ్యతిరేకులు కోర్టులను ఆశ్రయించగా , హైకోర్టు జీవో 9 చెల్లదని,జీవో 9 తో జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల నోటి ఫికేషన్ చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం,మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా,పాత రిజర్వేషన్లతో ఎన్నికలు జరుపాలని,

ఎన్నికలు జరుపుటకు తేదీలను ప్రకటించాలని కోరుతూ కో ర్టు ప్రభుత్వాన్ని కోరుతూ,మళ్ళీ విచారణ ఈనెల 24 కు వాయిదా వేయడం జరిగిందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారిత సంఘం అధ్యక్షులు పొలాస నరేందర్ తో పాటుగా బీసీ జేఏసీ నేతలు కాడార్ల రాములు, ఇల్లందుల వెంకటేష్,పిన్నింటి హన్మాండ్లు తదితరులు తెలియజేశారు. కోర్టుల తీర్పులు ఎలా ఉన్నప్పటికీ,చట్టబద్ధంగా,రాజ్యాంగ బద్దంగా ,పారదర్శకంగా 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ,స్థానిక ఎన్నికలు జరపాలని,అంతవరకు ఎన్నికలు జరుపక కోర్టులతో న్యాయపోరాటం,

కేంద్రంలో రాజకీయ పోరాటం చేయాలని ,పాత రిజర్వేషన్లతో,పార్టీ పర ఎన్నికలు జరపవద్దని ప్రభుత్వానికి బీసీ జేఏసీ నేతలు పొలాస నరేందర్, కడారి రాములు, ఇల్లందుల వెంకటేష్, పిన్నింటి హన్మాండ్లు తదితరులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వారి,వారి ప్రసంగాల్లో విజ్ఞప్తి చేశారు.బీసీలు చేస్తున్న ఈ పోరాటం ఏ వర్గాలకు వ్యతిరేకం కాదని,జనాభా దామాషా ప్రకారం బీసీలకు మంత్రి వర్గంలో,ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులలో,రాజకీయంగా, ఆర్థికంగా సామాజికంగా, విద్యాపరంగా, ఉపాధి, ఉద్యోగ, ప్రమోషన్ల పరంగా రావాల్సిన కోటాకై,

బీసీ సంక్షేమముకై రాష్ట్ర బడ్జెట్లో రావాల్సిన వాటాకై,పలు హక్కుల సాధనకై ,ఆత్మగౌరవంకై చేస్తున్న పోరాటమని ,ఈ పోరాటానికి అన్ని వర్గాలవారు,అన్ని మతాలవారు,రాజకీయాలకు అతీతంగా నేతలు, అఖిలపక్ష పార్టీలు,రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు,కోర్టులు మద్దతు తెలపాలని బీసీ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో బీసీ జేఏసీ నేతలు కడార్ల రాములు, ఇల్లందుల వెంకటేష్ ,పిన్నింటి హన్మాండ్లు,ఉయ్యాల భూమయ్య, చేను హెలపతి, సిహెచ్.రామస్వామి గౌడ్,