07-11-2025 01:22:42 AM
కరీంనగర్, నవంబర్ 6 (విజయక్రాంతి): రెండు రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే లక్షలమంది విద్యార్థులతో కలిసి సీఎం ఇంటిని ముట్టడిస్తామని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షు డు కసిరెడ్డి మణికంఠ రెడ్డి హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కరీంనగర్ లో మంత్రి పొ న్నం ప్రభాకర్ క్యాంప్ కార్యాలయం ముట్టడికి ఏ ఎస్ ఎఫ్ నాయకులు ప్రయత్నించగా పోలీసులకు అడ్డుకొని పోలీసు స్టేషన్ కి తరలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్ర జాపాలనలో 4 రోజుల నుండి 2000 పైగా ఉన్నతవిద్య కళాశాలలు బంద్ ఉండి లక్షలాది మం ది విద్యార్థులు ఇంటి వద్ద ఉన్న ప్రభుత్వం మౌనంగా ఉండటం సిగ్గుచేటన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, లేనిపక్షంలో సీఎం రే వంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్, రేణికుంట్లా ప్రీతం, మంద, అనిల్, రామారాపూ వెంకటేష్ , కుర్ర రాకేష్, జిల్లా ఆఫీస్ బేరర్స్ మామిడిపల్లి హేమంత్,కనకం సాగర్, కేశపోయిన రాము యాదవ్, లద్దునూరి విష్ణు, సాయి ఆజాద్, నాయకులు నవదీప్, ఆదిత్య, సోనూ, తదితరులు పాల్గొన్నారు.