01-08-2025 01:36:53 AM
ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి విద్యావంతుల ఐక్యవేదిక
ఖైరతాబాద్;జూలై 31 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్డినెన్స్ చేసి గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వా నికి పంపించిన బీసీ రిజర్వేషన్ బిల్లు ను కేంద్ర ప్రభుత్వం వెంటనే 9వ షెడ్యూల్లో చేర్చాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి విద్యావంతుల ఐక్య వేదిక కేంద్ర ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐక్యవేదిక నేతలు దేవరకొండ సైదులు, కిరణ్ కుమార్, సుంకర శ్రీనివాస్ లు మాట్లాడారు..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు న్యాయం చేయడమే లక్ష్యంగా తెలం గాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. రిజర్వేషన్ల సాధనకు చివరి అడుగులు వేస్తున్న వేళ తామంతా ప్రభుత్వానికి అండగా ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఢిల్లీలో ఈనెల 5, 6 ,7 తేదీలలో జరగనున్న వివిధ నిరసన కార్యక్రమాల్లో తాము సైతం పాల్గొంటున్నట్లు చెప్పారు.