01-08-2025 01:35:13 AM
- జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్
- శేరిలింగంపల్లిలో మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ పరిశీలన
హైదరాబాద్ సిటీబ్యూరో, జులై 31(విజయక్రాంతి): కాలనీల్లో పరిశుభ్రత చర్యలు ప్రభావంతంగా చేపట్టాలని, వర్షాకాల పారిశుద్ధ్య ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ క్షేత్రస్థాయి అధికారులు, పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. గురువారం శేరిలింగంపల్లి జోన్‌లో ఉదయం వర్షాకాల పారిశుద్ధ్య ప్రత్యేక కార్యక్రమాన్ని జోనల్ కమిషనర్ బోర్కడే హేమంత్ సహదేవ్ రావుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మొదట కావేరి హిల్స్‌లో తనిఖీలు చేసి, కార్మికులతో మాట్లాడారు. డిప్యూటీ కమిషనర్, స్థానిక అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను సమీక్షించారు. తదనంతరం పటాన్‌చెరువును సంద ర్శించి కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తనిఖీ చేపట్టారు. క్షేత్రస్థాయిలో అన్ని విభాగాలను సమ న్వ యం చేసుకుంటూ పారిశుద్ధ్య పనులను చేపట్టాలన్నారు. దోమల వృద్ధిని అరికట్టేందుకు డ్రై డే కార్యకలాపాలను ముమ్మరంగా చేపట్టాలన్నారు.