calender_icon.png 12 December, 2025 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలి

12-12-2025 12:35:58 AM

  1. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలి  
  2. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి  

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి) : తెలంగాణలో బీసీల మనోభావా లను, వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బీసీ బిల్లును ఆమోదించాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఓబీసీ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ జోక్యం చే సుకుని బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని కోరారు. గురువారం ఆయన లోక్ సభ లో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల బిల్లు ను ఆరు నెలల క్రితమే తెలంగాణ ప్రభుత్వం గ వర్నర్ వద్దకు పంపిందని, కానీ, ఇప్పటీ వరకు గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని ఎంపీ చామల గుర్తు చేశారు.

ఇప్పటికే బీసీలకు విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లో, అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపచేశారని ఎంపీ చామల పేర్కొన్నారు.