12-12-2025 12:37:08 AM
ములుగు,డిసెంబర్11(విజయక్రాంతి): నేడు రేపు జాతీయ రహదారి 163 మల్లంపల్లి వద్ద వంతెన మరమ్మత్తు కొరకు ట్రక్స్,లారీలు,బస్సులు వ్యాన్లు, వాహనాలను గూడెంపాడు వయా పరకాల రేగొండ గాంధీనగర్ జంగాలపల్లి ద్వారా ట్రాఫిక్ మళ్లింపు చేయడం జరుగుతుందని, వాహనదారులు సూచనలు పాటించాలని జిల్లా క లెక్టర్ దివాకర టి.ఎస్. గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.మల్లంపల్లి కెనాల్ బ్రిడ్జ్ వ ద్ద, పీఠాలతో పాటు అబట్మెంట్ A1 మ రియు A2 పూర్తయ్యాయి.
ప్రీకాస్ట్ గ్రిడర్ల ఏర్పాటును చేపట్టుటకు, గిర్డర్ లాంచింగ్లో భారీ క్రేన్లు మరియు పెద్ద రవాణా వాహనాలను మోహరించడంతో పాటు కాస్టింగ్ యార్డ్ నుండి బ్రిడ్జ్ సైట్కు గిర్డర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని గూడెప్పాడ్ నుండి పర్కల్, రేగొండ, గాంధీనగర్, జంగాలపల్లి మీదుగా ట్రక్కులు, లారీలు, బస్సులు, వ్యాన్లతో సహా ట్రాఫిక్ను ఈ సమయాల్లో వాహనాలు మళ్లించేలా ఏర్పాటు చేసి పను లు సజావుగా జరిగేలా చూడాలని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కలెక్టర్ ఆ ప్రకటనలో అధికారులకు ఆదేశించారు.