12-12-2025 12:35:36 AM
చిన్యా తండా సర్పంచ్‌గా హరిచంద్ ఎన్నిక
మహబూబాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్యా తండా గ్రామ సర్పంచ్ గా జాటోత్ హరిచంద్ ఎన్నికయ్యారు. 2019 లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవి ఎస్టీ మహిళలకు కేటాయించడంతో గ్రామ సర్పంచ్ గా హరిచంద్ తన సతీమణి అరుణను పోటీకి నిలపగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తాజాగా జరిగిన పం చాయతీ ఎన్నికల్లో ఆ గ్రామ సర్పంచ్ పదవి ఎస్టి జనరల్ కు కేటాయించారు. దీనితో ఈసారి సర్పంచ్ పదవికి మాజీ సర్పంచ్ అరుణ భర్త హరిచంద్ పోటీ చేశారు. గురువారం జరిగిన ఎన్నికల్లో 228 ఓట్లు పోల్ కాగా, హరి చందు కు 117 రాగా, ప్రత్యర్థి శ్రీనుకు 108 ఓట్లు రాగా మూడు ఓట్లు చెల్లలేదు. దీనితో హరిచంద్ కేవలం 9 ఓట్ల తేడాతో సర్పంచ్ గా విజయం సాధించారు.