16-08-2025 05:27:44 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా బీసీ సంక్షేమ సంఘం పూర్తి కార్యవర్గాన్ని శనివారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో జిల్లా అధ్యక్షుడు పొన్నం నారాయణ గౌడ్(District President Ponnam Narayana Goud) ప్రకటించారు. బీసీల హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం ఈ కమిటీ పనిచేస్తుందని ఆయన తెలిపారు. గౌరవ అధ్యక్షుడుగా డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శులుగా పూదరి జనార్ధన్, డాక్టర్ కత్తి కిరణ్, ఉపాధ్యక్షులుగా భోజన్న, విశాల్ సాయి, బట్టి లింబాద్రి, కార్యదర్శులుగా అంబదాస్, నరహరి, భోజన్న, రాజ మహేందర్, సహకార్యదర్శులుగా సట్ల మహేష్, సాయినాథ్, సంజు, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడుగా పొన్నం రాహుల్ గౌడ్ లను ప్రకటించారు.