calender_icon.png 24 November, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో 46తో బీసీల రాజకీయ సమాధి

24-11-2025 12:12:59 AM

-జీవో రద్దు చేసేవరకు ప్రభుత్వంపై పోరాటం ఆగదు 

- బీసీలకు అన్యాయం చేసిన ప్రభుత్వాలపై తిరుగుబాటు తప్పదు

-బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్

-జీవో ప్రతులను చించి నిరసన

హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ తగ్గిస్తూ రాష్ర్ట ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 46ను తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో బీసీల ఆగ్రహానికి సర్కారు గురికావాల్సి వస్తుందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.

రాష్ర్ట ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46ను వ్యతిరేకిస్తూ రాష్ర్టవ్యాప్తంగా జీవో ప్రతులను దగ్ధం చేయాలని బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం హైదరాబాద్ అంబర్‌పేటలోని మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహం వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జీవో ప్రతులను బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణా, కో చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్‌లతో కలిసి చించివేసి నిరసన వ్యక్తంచేశారు.

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీల చీకటి ఒప్పందం వల్లే ఆగమేఘాల మీద జీవో నంబర్ 46 తీసుకు వచ్చిందని, రాష్ర్టంలో అధిక శాతం రెడ్లను సర్పంచ్‌లుగా చేయడానికి అగ్రకుల నాయకులు కుట్రలు, కుతంత్రాలు చేస్తూ బీసీలను రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

అసెంబ్లీలో బిల్లులు పెట్టి చట్టం చేసే సందర్భంలో మద్దతిచ్చిన రెండు పార్టీలు ఇప్పుడు మాటమా ర్చి బీసీలకు ద్రోహం తలపెట్టాయని, కేంద్ర మంత్రులు, ముఖ్యమం త్రులతోపాటు సర్పంచ్ పదవులను కూడా అగ్రకులాలకే కట్ట పెట్టాలనే కుట్రతోనే 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలపలేదని ధ్వజమెత్తారు.

కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల బీసీ వ్యతిరేక పాలనతోనే తెలంగాణలో బీసీల రాజకీయ సమాధి జరుగుతు న్నదని ఆందోళన వ్యక్తంచేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాడకుం డా, బీసీలకు సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోతున్నదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించే వరకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాన్ని ఆపేది లేదని హెచ్చరించారు.

కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాంకుర్మా, బీసీ సంక్షేమ సంఘం రాష్ర్ట కార్యదర్శి జాజుల లింగంగౌడ్, బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ బొల్లెపల్లి స్వామి, రాష్ర్ట నాయకులు నందగోపాల్, ఉదయనేత, గూడూరు భాస్కర్ మీరు, సత్య రాజుగౌడ్, బూర శీను, మధుయాదవ్, తాంపాటి వెంకట్, గుంటి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.