24-11-2025 12:16:42 AM
సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటాల్సిందే
కరీంనగర్, నవంబరు 23 (విజయ క్రాంతి): కాంగ్రెస్ అధిష్టానం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకంలో బలహీనవర్గాలకు పెద్దపీట వేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల అధ్యక్షులలో మూడు జిల్లాలకు బీసీ నాయకులను నియమించింది. రెండు చోట్ల ఎమ్మెల్యేలను, రెం డు చోట్ల పార్టీ సీనియర్ నాయకులకు అవకాశం కల్పించింది. కరీంనగర్ జిల్లాలో కీల మైన కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్ష పీఠం కూడా బీసీని వరించింది.
సర్పంచ్ ఎన్నికల సమయంలో అధ్యక్షుల నియామకం చేయడంతో నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేత లకు ఈ పదవి ముళ్ల కిరీటమే కానుంది. ఆ యా జిల్లాల్లో మెజార్టీ సర్పంచ్ స్థానాలలో తమ వారిని గెలిపించుకోవడంతోపాటు 42 శాతం పార్టీ పరంగా అభ్యర్థుల ఎంపిక వరకు వీరంతా సమన్వయంతో ముందుకెళ్ల వలసిందే, కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా ఎ స్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నా యకుడు, సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత విధేయుడు,
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి స త్యంను నియమించారు. కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షునిగా సీనియర్ నాయకుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వైద్యుల ఆంజన్ కుమార్ కు అవకాశం కల్పించారు. అలాగే పెద్దపల్లి జిల్లా పీఠాన్ని మరోమారు రామగుండు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కు అప్పగించారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కనుక మక్కాన్ సిం గ్ అధ్యక్షునిగా సమన్వయంతో ముందుకెళ్లవలసి ఉంటుంది.
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అనుచరుడు మాజీ సర్పంచ్, పద్మశాలి వర్గానికి చెందిన గాజంగి నందయ్యకు అవకాశం కల్పించారు. జగిత్యాల జిల్లాలో జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్ మధ్య విబేధాలు ఉన్న నేపథ్యంలో నం దయ్య ఇరువర్గాలను సంతృప్తిపరుస్తూ ముందుకెళ్లడం ముళ్ల కిరీటమే. ఇక్కడి నుం డి కోరుట్లకు చెందిన సీనియర్ నాయకుడు జువ్వాడి నర్సింగరావు, మరో నాయకుడు కల్వకుంట్ల సుజిత్ రావులు అధ్యక్ష పదవిని ఆశించగా పార్టీ అనూహ్యంగా నందయ్యకు అవకాశం కల్పించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి, ఉమేష్ రావులను కాదని సీనియర్ నాయకుడు, పార్టీకి విధేయుడైన సంగీతం శ్రీనివా స్‌కు అవకాశం కల్పించారు. ఈయన నియామకంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్య వహరించింది. సంగీతం శ్రీనివాస్ సిరిసిల్ల పట్టణంలో అత్యధికంగా ఉన్న పద్మశాలి వ ర్గానికి చెందినవారు. ఇటీవలే ఆయన పీసీసీ ప్రధాన కార్యదర్శిగా కూడా నియమితులైనారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని సంగీతం శ్రీనివాస్ నియామకంతో స్పష్టమయింది.
సంగీ తం శ్రీనివాస్ జిల్లా సాధన ఉద్యమంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా అనేక ఉద్యమాలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ జిల్లా అధ్యక్ష పదవి పీఠాన్ని కరీంనగర్ పార్లమెంటరీ ఇంచార్జి వెలిచాల రాజేం దర్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి,
జమ్మికుంటకు చెందిన పత్తి కృష్ణారెడ్డి, తదితరులు ప్రయత్నం చేసినప్పటికీ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సీని యర్ నాయకుడు, విద్యావంతుడైన మేడిపల్లి సత్యంకు అవకాశం కల్పించారు. నూత నంగా నియమితులైన వీరందరిపై సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన ఆవశ్యకత ఉంది. సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, నగరపాలక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో వీరి పనితీరు ప్రధాన భూమిక పోషించనుంది.