calender_icon.png 24 November, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ ఇందిరమ్మఇళ్లు మంజూరు చేస్తాం

24-11-2025 12:11:39 AM

  1. వట్టెముల గ్రామంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన విప్

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 23 (విజయక్రాంతి):అర్హులందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు..ఆదివారం వేములవాడ రూరల్ మండలం వట్టెముల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు.

వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు.పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. 200 యూనిట్లకు ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీ పది లక్షలకు పెంపు, నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని తెలిపారు.

ఉచిత బస్సు సౌకర్యం ద్వారా సుమారు ఇప్పటి వరకు 200 కోట్లు ఉచిత ప్రయాణలు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు.ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు..ఇప్పటికే రెండవ విడతలో వేములవాడ నియోజకవర్గనికి 3500 ఇళ్లు మంజూరు చేసానని వాటి నిర్మాణలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి పేరిట చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు ఇస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో 1 లక్ష 45 వేల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. మహిళా సంఘాలలో లేని వారికి కూడా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు,వైస్ చైర్మన్ కనికరపు రాకేష్,రూరల్ మండల అధ్యక్షులు వకులభరణం శ్రీనివాస్,మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ మార్కెట్ కమిటీ సభ్యులు పాలకుర్తి పర్షరములు,దైత కుమార్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రోమాల ప్రవీణ్,గ్రామ శాఖ అధ్యక్షులు శంకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..