calender_icon.png 10 August, 2025 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

14న జరిగే ధర్నాను జయప్రదం చేయండి

09-08-2025 10:41:48 PM

ఎం.డి రజాక్..

కొత్తగూడెం (విజయక్రాంతి): ఈనెల 14వ తేదీన కొత్తగూడెం ఏరియా జిఎం ఆఫీస్ ముందు నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్(Area Vice President MD Razak) పిలుపునిచ్చారు. ఐఎన్టియుసి ఆధ్వర్యంలో జరిగే ఈ ధర్నాకి కార్మికులంతా పెద్ద సంఖ్యలో హాజరై కార్మికుల సమస్యలపై గళం విప్పాలన్నారు. శనివారం ఏరియాలోని  జీకే ఓసి లో రజాక్ పర్యటిస్తూ, కార్మికులతో కలిసి ముచ్చటించారు. ఐ ఎన్ టి యు సి  సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాలతో, కార్మికుల పెండింగ్ సమస్యల సాధన లక్ష్యంగా  ఈనెల 14వ తేదీన ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు గోపు కుమార స్వామి, విప్లవ రెడ్డి,భీముడు,పోశం శ్రీనివాస్, కొమురయ్య భరత్ సీతారామరాజు  వసంత కుమార్ నాగమోహన్  దుర్గా సింగ్, రవీంద్ర రావు,లక్ష్మణ్ రాజు, రవీందర్, ఎస్ శ్రీనివాస్, రెడ్డి, గౌస్ తదితరులు పాల్గొన్నారు