30-01-2026 02:18:48 AM
బీసీ ఇంట లెక్చువల్ ఫోరమ్ చైర్మన్ మాజీ ఐఏఎస్ చిరంజీవులు
ఖైరతాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు జనాభా దామాషా ప్రకారం బీసీలకు 56శాతం స్థానాలు కేటాయించాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఎఎస్ చిరంజీవులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీసీల ద్రోహి పార్టీలుగా చిత్రీకరిస్తా మని హెచ్చరించారు. ఎన్నికల్లో కూడా ఈ పార్టీలకు బీసీలు ఓట్లు వెయొద్దని ప్రచా రం చేస్తామని తెలిపారు. బీసీలు 56 శాతం ఉన్నారని లెక్కలు చెప్పడం,42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీనివ్వడం తర్వాత ఇష్టానుసారంగా రిజర్వేషన్లు తగ్గించుకొంటూపోతే బీసీ సంఘాలు చూస్తూ ఊరుకోబోవన్నారు.
గురువారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్.దుర్గయ్య గౌడ్ ఆధ్యక్షతన జరిగిన మీడియా సమావేశానికి చిరంజీవు లు ముఖ్యఅతిథిగా హాజరై ఫ్రంట్ చైర్మెన్ బాలగోని బాలరాజు గౌడ్, ఎలికట్టే విజయ కుమార్ గౌడ్‌తో కలిసి మాట్లాడారు. ఒకవైపు తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద మేడా రం జాతరకు ప్రజలంతా వెళ్తే మరోవైపు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ 28 నాడే ఇచ్చి, 29 నుంచే నామినేషన్లు అనడం సరికాదన్నారు.
కనీసం తెలంగాణ ప్రజలు పండుగ చేసుకోనంత స్వేచ్ఛ కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిం చడం లేదని, ఇదేనా ప్రజా పాలన అంటూ ప్రశ్నించారు.సర్పంచ్ ఎన్నికల తరహాలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనరల్ స్థానా ల్లో బీసీలు పోటీ చేయాలని పిలుపునిచ్చా రు. ఎస్సీ, ఎస్టీలను కలుపుకొని బీసీలు ముందుకెళ్లి, బహుజనవాదాన్ని గెలిపించాలని కోరారు. గత కేంద్ర ప్రభుత్వాలు బీసీల కులగణన చేస్తాయని మాటనిచ్చి మోసం చేశాయన్నారు. అధికారంలో లేనప్పుడు బిజెపి బీసీల కులగణన చేయాలని తీర్మానించి, తర్వాత మాట మార్చి ఒసీలకు 10 శాతం ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ సామాజిక న్యా యం అంటూ వందలకోట్లు ఖర్చుతో కులగణన చేసి లెక్కలను ఇంతవరకు బయట పెట్ట లేదన్నారు. గత పదేళ్ల బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో బీసీలను ఏనాడూ పట్టించుకోలేద న్నారు. ఈ మూడు పార్టీలను మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం ఏడాది చొప్పున 21 బీసీ కార్పొరేషన్లకు రూ.2,800కోట్లు కేటాయించి, ఒక్క రూపాయి కూడా మం జూరు చేయలేదన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభు త్వ హయాంలో కూడా బీసీ పేదలకు రావాల్సిన నిదులు ఇరిగేషన్ ప్రాజెక్టుకు మళ్లించా రని ఆరోపించారు.
ఇప్పటికైనా బడ్జెట్లో బీసీలకు కేటాయించే నిదులన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. బాలరాజు గౌడ్ మాట్లాడుతూ అధికారంలో లేని రాష్ట్రాల్లో జనగణ నలో కులగనన చేస్తామని మాట ఇచ్చి అధికారం చేపట్టగానే కులగన బీసీ కులగననపై లేనిపోని షరతులు పెడుతూ బీసీ లను ఇబ్బందికి గురి చేస్తుందన్నారు. ఎన్నికల్లో బీసీల వాటా ఇచ్చేంతవరకు తాము ఉద్యమిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అం బాల నారాయణగౌడ్, శ్రీకాంత్,లింగేశ్ యాదవ్, డోమల రాజు పాల్గొన్నారు.