30-01-2026 02:19:00 AM
ఆస్పత్రుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
‘ఐటీ’లో పోటీ పెరిగే దిశగా స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలి
సమీక్షా సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు
హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): పునరుత్పాదక ఇంధన రంగంలో చేపడుతున్న కార్యక్రమాలను వేగవంతం చేయాలని, ప్రాజెక్టుల అమలులో నిర్ణీత కాలపరిమితులను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విద్యుత్ రంగంలో అమల వుతున్న విధానాన్ని పరిశీలించి మన రాష్ట్రం లో కూడా వివిధ డిస్కంలలో అమలు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు.
సీఎం ఆదేశాల మేరకు ఇంధన, వైద్య ఆరో గ్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమలు, మైన్స్, టీజీఐఐసీ, భారత ఫ్యూచర్ సిటీ, ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మూసీ సుందరీకరణ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ తదితర శాఖల పనితీరుపై విభాగాల వారీగా గురువారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, టీజీ ట్రాన్స్‌కో, టీజీ జెన్కో, టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్సీడీసీఎల్ విభాగాలలో కొనసాగుతున్న ప్రతిపాదిత ప్రాజె క్టుల పురోగతి, అలాగే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచే యాలని ఆదేశించారు.
ఈ తదితర అంశాలు, అండర్ గ్రౌండ్ కేబులింగ్, విజన్ లక్ష్యాలు, గ్రేటర్ హైదరాబాద్ భవిష్యత్ విద్యుత్ అవసరాల మేరకు ప్రతిపాదించిన చంద్రవెళ్లి, రాయదుర్గం, షాద్ నగర్, పరిగిలో విద్యుత్ సబ్ స్టేషన్ల పనుల పురోగతిపై సీఎస్ సమీక్షించారు. రాష్ట్రంలోని వరంగల్, ఆల్వాల్, సనత్ నగర్, ఎల్బీ నగర్, న్యూ ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రి విస్తరణ పలు ప్రాంతాల్లో నిర్మితమవుతున్న ప్రభుత్వాస్పత్రుల భవనాల పురోగతి, ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యత, వైద్య సదుపాయాల లభ్యత, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వాస్పత్రుల్లో మందుల సరఫరా, వైద్య శాఖలో నర్సింగ్, వైద్యుల నియ మకాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఈహెచ్‌ఎస్ పథకం, వైద్య పరికరాల సరఫరా తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు.
రాష్ట్రాన్ని ఐటీ రంగంలో మరింత పోటీగా నిలిపే దిశగా స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేశ్ రంజన్, సంజయ్ కుమార్, నవీన్ మిట్టల్, మైన్స్ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, మున్సిపల్ పరిపాలన కార్యదర్శి టీకే శ్రీదేవి, టీజీ ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కమిషనర్ శశాంక, హైడ్రా కమిషనర్ ఏ.వీ.రంగనాథ్, ఐటీ ప్రత్యేక కార్యదర్శి భవేష్ మిశ్రా, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి,హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ ఆశోక్ రెడ్డి పాల్గొన్నారు.