13-09-2025 08:27:58 PM
బిజెపి పార్టీ శ్రేణులకు పిలుపు..
బిజెపి కో కన్వీనర్ ఆడెపు రవీందర్.
ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో "సేవా పక్షం" మండల స్థాయి కార్యాశాల కార్యక్రమం మండల అధ్యక్షుడు క్రాంతికుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కో కన్వీనర్ ఆడెపు రవీందర్(BJP co-convener Adepu Ravinder) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజులు సేవా కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, విశ్వబ్రాహ్మణులను సన్మానించడం. ప్రభుత్వ ఆసుపత్రిలో, పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్దేశించారు.
ఇట్టి కార్యక్రమంలో మండల ప్రధానకార్యదర్శి, ఎదునూరి గోపికృష్ణ,మహేశ్వరీ, జిల్లా ఉపాధ్యక్షులు మల్లారపు సంతోష్ రెడ్డి,అసెంబ్లీ కన్వీనర్ మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి మీస సంజీవ్, సేవపక్షం మండల కన్వీనర్ పప్పుల శ్రీకాంత్, కో కన్వీనర్ దీటి సత్యం,చిట్టినేని శ్రీనివాస్ రావు,జిల్లెల్ల మల్లేశం, కమిటీకారి పద్మ, జనార్దన్,చిగురు వెంకన్న,కాసోడి రమేష్,తిరుపతి,ప్రశాంత్,కనకయ్య,ప్రభాకర్,మీస స్వామి,ఊరడి రాజు,నవీన్, చంద్రశేఖర్,సాయి,పిరాళ్ల విజయ్, శివ బూత్ అధ్యక్షులు, బిజెపి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.