17-11-2025 12:38:19 AM
ములకలపల్లి, నవంబర్ 16 (విజయక్రాంతి): కౌమార బాలికలు ఆరోగ్యం పై అవ గాహన కలిగి ఉండాలని గుడ్ షెఫర్డ్ సంస్థ సిస్టర్స్ సూచించారు.ములకలపల్లి లోని గుడ్ షెఫర్డ్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సుమారు 80 మంది బాలికలు, కౌమార బా లికలకు ఆరోగ్యపరమైన అంశాలపై, పౌష్టిక ఆహారంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో సంస్థ సిస్టర్ తో పాటు వైద్య సిబ్బంది రమాదేవి పాల్గొని వారికి పౌష్టికాహారం ప్రాము ఖ్యత,ఆరోగ్య సంరక్షణ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
అదేవిధంగా రుతుక్రమ సమయంలో పాటించ వలసిన పరిశుభ్రతపై కిశోర బాలికలకు వివరించారు. యుక్త వయసులో శారీరకంగా మానసికంగా ఎదుగుదలకు సంబంధించి సంతులిత ఆహారాన్ని తీసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో గుడ్ షెఫర్డ్ సిస్టర్స్ ఉదయ, దీప్తి, రాజ్యం, బెనూషియా సంస్థ సిబ్బంది సుజాత,సాగర్ నాగరాజు, సందీప్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.