calender_icon.png 9 August, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇనుగుర్తి ప్రభుత్వ కార్యాలయాల్లో ఇన్చార్జి కలెక్టర్ తనిఖీలు

08-08-2025 01:33:59 AM

మహబూబాబాద్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో గురువారం అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాలయం, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించారు. అలాగే ఓ ఫర్టిలైజర్ షాప్ లో కూడా తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధానంగా హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్, రైతులకు సంబంధించి ఎరువుల నాణ్యత, ప్రజలకు సత్వరమైన సేవలు పై ప్రత్యేక దృష్టి పెట్టి పారదర్శకంగా కార్యకలాపాల నిర్వహణకు శ్రీకారం చుట్టిందని అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు వారికి కేటాయించిన విధులను క్రమం తప్పకుండా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.