26-09-2025 12:07:40 AM
మంత్రి శ్రీధర్ బాబు
మహదేవపూర్, సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ని బి ఎల్ ణఎన్ గార్డెన్ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందించారు. ప్రతి పేదవాని సొంతింటి కల నెరవేర్చటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఐదు మండలాలకు సంబంధించిన 300 మంది ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రలు అందజేస్తూ ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, ఆట్టి జాబితాను అధికారులతో విచారణ జరిపించి నిరుపేదలను ఎంపిక చేసినట్లు తెలిపారు.
నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇల్లు మంజూరు అయ్యాయని, ప్రతి సంవత్సరం 3500 ఇల్లు మంజూరు చేసి నిరుపే దలకు మొదటి స్థానం కల్పిస్తామని తెలిపారు. గతంలో ఇల్లు నిర్మాణం చేపట్టాని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఒక ఇల్లు అందించలేదని తెలిపారు. మంజూరైన ఇళ్లకు 5 లక్షలతో నిర్మాణం జరుగుతుందని నాలుగో విడతలుగా లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రతి సోమవారం లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఇంటి నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా మహిళా సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు.
400 నుండి 599 స్క్వేర్ ఫీట్స్ వరకు ఇంటి నిర్మాణం చేపట్టాలని అన్నారు. అంతకుమించి ఇంటీ సైజు పెరిగితే బిల్లులు విడుదల కావాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుకను అం దించడం, సిమెంట్ కూడా తక్కువ ధరకు అందిస్తామని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, మహిళలకు రూ.20 వేల కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలను అందించామని తెలిపారు. రైతు రుణమాఫీ, విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని తెలిపారు. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్ర మాలను మా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఒక ఇల్లు నిర్మిస్తే ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళుగా ఉంటామని తెలిపారు.
అధికారులు పేదలకు ఇబ్బందులు కలిగించే పనులు చేయవద్దని మారుమూల ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు, సేవలు చేయాలని ప్రజల ఆదరణ పొందాలని అధికారులను ఆదేశించారు. ఇంటి నిర్మాణా లలో జాప్యం లేకుం డా ఎం పీ డీ వో లు గృహ నిర్మాణ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఇల్లు నిర్మాణం ఆగిపోతే ఎంపీడీవో గృహ నిర్మా ణ శాఖ అధికారులు వేతనాల నుంచి కోత విధిస్తామని మంత్రి హెచ్చరించారు. ప్రభు త్వ పథకాలు అమలులో ప్రభుత్వ అధికారులు కానీ ఇతరులు ఎవరైనా లబ్ధిదారుల ను డబ్బులు అడిగినా ఇంకేదైనా ప్రయోజనం పొందిన పోలీస్ కేసు నమోదు చేయాలని ప్రజలకు సూచించారు.
మీ ఆశయాలను నెరవేర్చాలని లక్ష్యం తో ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందని, మంజూరు అయినా ప్రతి లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవాలని సూచిం చారు. ఇల్లు నిర్మాణంతో కుటుంబం సంతోషంగా ఉండాలని మనం మన చేతి గుర్తు గుర్తుకు రావాలన్నారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోషణ మాసం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడి సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహారం స్టాండ్ల ను పరిశీలించి వంటకాలను రుచి చూశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలింతలకు చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించడం లక్ష్యం గా పోషణ మాస కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.
అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులను, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డి, ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు రమేష్, జిల్లా గ్రం ధాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, కాటారం మార్కెట్ కమిటీ చైర్పర్స న్ తిరుమల, సబ్ కలెక్టర్ మాయంక సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ లోకి లాల్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని మల్లీశ్వరి, మిషన్ భగీరథ ఈ ఈ శ్వేత, మహ దేవపూర్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ తిరుపతిరెడ్డి, సి డి పి ఓ రాధిక తదితరులు పాల్గొన్నారు.