14-11-2025 12:38:06 AM
రైటర్లతో సమీక్షలో ఎస్పీ రాజేష్ చంద్ర మార్గనిర్దేశం
కామారెడ్డి, నవంబర్ 13 (విజయక్రాంతి): కేసుల విచారణలో నాణ్యత లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లా ఎస్పీ రాజన్న స్టేషన్ రైటర్ ,సర్కిల్, డీఎస్పీ ఆఫీస్ రైటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కేసుల దర్యాప్తు, విచారణ పరిశోధనలో నాణ్యతా ప్రమాణాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు.
ముఖ్యంగా CCTNS వ్యవస్థలో కేసులకు సంబంధించిన అన్ని వివరాలు సమయానుసారంగా అప్డేట్ అవుతూ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రైటర్లకు సూచించారు. సాక్షుల, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు ప్రతి కేసులో కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ గుర్తుచేశారు. తప్పుడు సమాచారం లేదా నేరస్థుల కు అనుకూలంగా ఇచ్చే స్టేట్మెంట్లు విచారణ నాణ్యతను దెబ్బతీస్తాయని తెలిపారు.
ఎఫ్‌ఐఆర్ నుంచి చార్జీషీట్ వరకు అన్ని వివ రాలు స్పష్టంగా, సమగ్రంగా, తప్పులు లేకుం డా నమోదు చేయడం ప్రతి రైటర్ బాధ్యత అని సూచించారు. బాధితునికి సమయానికి న్యాయం జరగేలా ప్రతి చర్య ఉండాలని, బాధితునికి న్యాయం లభిస్తేనే చట్టంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. అదే పోలీస్ బాధ్యత అని ఎస్పీ తెలిపారు . ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కె. నరసింహ రెడ్డి, ఇతర అధికారులు, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల రైటర్లు పాల్గొన్నారు.