14-11-2025 12:36:43 AM
అర్మూర్, నవంబర్ 13 (విజయ క్రాంతి): నిర్మల్ న్యాయవాది పుట్ట అనిల్ కుమార్ పై కానిస్టేబుల్ దాడిని నిరసిస్తూ అర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహి ష్కరించి సంఘీభావం తెలిపారు.
తాను పోలీసులు అనే విషయాన్ని మరిచి న్యాయ వాదిపై అతని కారును ధ్వంసం చేయడాన్ని ఖండించారు. ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించి దాడి చేసిన కానిస్టేబుల్‌పై ఈ సంఘటనకు సంబంధిం చిన పై అధికారులపై వెంటనే కేసులు నమోదు చేయాలని,
ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడమైనది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గటడి ఆనంద్, సంయుక్త కార్యదర్శి మద్దుల గంగారం, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.