22-11-2025 01:11:01 AM
గట్టు, నవంబర్ 21: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సు మల్లేష్ సూచించారు. శుక్రవారం గట్టు మండలంలో బోయల గూడెం గ్రామంలో గ్రామస్తులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సు మాట్లాడుతూ.. నేటి కాలంలో ప్రజలు సైబర్ నేరాల గురై మోసపోతున్నారని అన్నారు. ఎవరైనా సైబర్ కేటుగాళ్ల వలలో పడితే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నెంబరుకు సంప్రదించాలన్నారు.