22-11-2025 01:32:26 AM
రిజర్వేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి
జిల్లా కలెక్టర్ కె.హైమావతి
సిద్దిపేట కలెక్టరేట్,నవంబర్: 21గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు.శు క్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి మార్గదర్శకాలు జారీ చేశా రు. జిల్లాలోని 508 గ్రామ పంచాయతీలు, 4508 వార్డుల కోసం రిజర్వేషన్లు రాష్ట్ర ఎ న్నికల సంఘం నిబంధనల ప్రకారం చేపట్టాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు 2011 సెన్సస్ను, బీసీ రిజర్వేషన్లకు ఎస్‌ఈఈఈపిసి 2024 నిబంధనలను ఆధారంగా తీ సుకోవాలని, మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా చూడాలని సూచించారు. రిజర్వేషన్ ప్రక్రియను ఆయా డివిజన్ల ఆర్డీవోల నేతృత్వంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ వార్డు సభ్యుల రిజర్వేషన్లు కూడా ఎస్‌ఈఈఈపిసి మార్గదర్శకాల ప్రకారమే అమ లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జెడ్పీసీఈఓ రమేష్, డిపిఓ విజయ్ కుమార్, ఆర్డీవోలు సదానం దం, చంద్రకళ, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీడీ వోలు పాల్గొన్నారు.