22-11-2025 01:30:15 AM
-పెద్దమందడి మండలంలో కార్యక్రమం ప్రారంభం
-రూ . 5 కోట్ల వ్యయంతో జిల్లా మహిళా సమాఖ్య భవనం నిర్మాణ దశలో
-జగత్ పల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవం
-రెండు వరసల రోడ్డు పనులకు భూమి పూజ
-స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి
వనపర్తి , నవంబర్ 21 (విజయక్రాంతి) : ఉక్కు మహిళా, మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ 108వ జయంతిని పురస్కరించుకొని రాష్ర్టంలోని మహిళలకు సారే ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రాష్ర్ట ముఖ్యమంత్రి కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు.
వనపర్తి జిల్లాలో చీరల పంపిణీ కార్యక్రమం శుక్రవారం పెద్దమందడి మండలంలో ప్రారంభించగా శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో 15 మండలాలు ఉండగా మొదటగా తన స్వంత మండలం పెద్దమందడిలో ప్రారంభ కార్యక్రమం నిర్వహిస్తున్న ట్లు చెప్పారు.
జిల్లాలోని గ్రామీణ మహిళా సంఘాల సభ్యులకు 89 వేల పైచిలుకు చీరలు వచ్చాయని, మున్సిపాలిటీలకు మరో 40 వేల చీరలు వస్తాయని తెలిపారు. 18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి మహి ళా సంఘం సభ్యులకు ఉచితంగా ఒక చీర ఇవ్వనున్నట్లు చెప్పారు. మహిళకు ఇస్తున్న చీరలు చాలా నాణ్యమైనవని, రాష్ర్ట ప్రభు త్వం మహిళల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
రూ. 5 కోట్ల వ్యయంతో జిల్లా మహిళా సమాఖ్య భవనం నిర్మాణ దశలో..
గ్రామీణ ప్రాంతాల నుండి మహిళలు ఏదైనా పని మీద వనపర్తి పట్టణానికి వస్తే సేద తీరడానికి, మహిళల సమస్యల పై చర్చించుకోడానికి రూ. 5 కోట్ల వ్యయంతో జిల్లా మహిళా సమాఖ్య భవనం నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు. నియోజక వర్గంలోని ప్రతి మండలానికి, గ్రామానికి రోడ్లు, సీసీ రోడ్లు వేయించడమే కాకుండా అన్ని విధాలైన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.
జగత్ పల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవం..
పెద్దమందడి మండలం, జగత్ పల్లి గ్రామ పంచాయతీలో జాతీయ ఉపాధి హామీ నిధులు రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని శాసన సభ్యులు మేఘారెడ్డి , జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి లు ప్రారంభోత్సవం చేశారు.
రెండు వరసల రోడ్డు పనులకు భూమి పూజ
రాష్ర్ట ముఖ్య మంత్రి ఎ రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లా పర్యటన సందర్భంగా రాజనగరం నుండి పెద్దమందడి వరకు రూ. 40 కోట్ల వ్యయంతో మంజూరు చేసిన రెండు వరుసల రోడ్డు కు శాసన సభ్యులు మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి భూమి పూజ చేశారు. రోడ్డు పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టి సాధ్యమైనంత త్వరగా రోడ్డు పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు.
ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్, అడిషనల్ డి ఆర్ డి ఓ సరోజ, తహసిల్దార్ పాండు ఎంపీడీవో పరిణత, జిల్లా మహిళా సమాఖ్య చైర్మన్ స్వరూప, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టన్న, వెంకటస్వామి, ఐ. సత్యా రెడ్డి, రఘు ప్రసాద్, ఎ పి.యం సక్రూ నాయక్, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు
పీర్లగుట్టపై కమ్యూనికేషన్ రిపీటర్ భవనం
వనపర్తి క్రైమ్ , నవంబర్ 21 : ఆధునిక పోలీసింగ్‌కు పీర్లగుట్ట కమ్యూనికేషన్ నెట్‌వర్క్ మరింత బలోపేతం చేస్తుందని, పోలీసు కమ్యూనికేషన్ నెట్‌వర్క్ బలోపేతానికి ఇది ఒక కీలకమైన ప్రాజెక్టు అని శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి పీర్ల గుట్ట పై కమ్యూనికేషన్ రిపీటర్ భవనానికి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో ప్రజలకు మరింత భద్రతను అందించడానికి పోలీస్ విభాగంలో ఆధునిక సదుపాయాలు అవసరం.
రూ.72 లక్షల వ్యయంతో కమ్యూనికేషన్ రిపీటర్ భవనం నిర్మాణం ప్రారంభమవడం వనపర్తికి ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ వసతి ద్వారా పోలీసులు వేగవంతంగా స్పందించి ప్రజలకు దగ్గరవుతారనీ అన్నారు. అభివృద్ధి ప్రతిచోటా కనిపించేలా ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి ఏఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి, వనపర్తి డిఎస్పి, వెంకటేశ్వరరావు,శిక్షణ డిప్యుటీ కలెక్టర్,శ్రావ్య, మార్కెట్ కమిటీ చైర్మన్, శ్రీనివాస్ గౌడ్, వనపర్తి సిఐ, కృష్ణయ్య, కొత్తకోట సిఐ, రాంబాబు, స్పెషల్ బ్రాం సీఐ, నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్,, వనపర్తి ఎమ్మార్వో, రమేష్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ ఎఈ, అనిల్ శాస్త్రి, పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.